మార్చ్ 26(సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం: జహీరాబాద్ పట్టణంలో బుధవారం కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులకు జనజీవనం అస్తవ్యస్తమైంది. గాలుల తీవ్రతకు జహీరాబాద్ – తాండూరు అంతర్ జిల్లా ప్రధాన రహదారిపై పలుచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. దీంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
విషయం తెలుసుకున్న జహీరాబాద్ రూరల్ ఎస్సై కాశీనాథ్, తన సిబ్బందితో కలిసి తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు నాలుగు ప్రాంతాల్లో రోడ్డుకు అడ్డంగా పడిన చెట్లను సిబ్బంది మరియు స్థానికుల సాయంతో పక్కకు తొలగించారు. పోలీసుల సకాలంలో స్పందనతో వాహన రాకపోకలు పునరుద్ధరించబడటంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
There’s certainly a lot to learn about this topic. I love all
of the points you have made.