మే 09 (సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల ప్రతినిధి: స్వాతి, నర్సిములు):
పట్టణంలోని ‘యన్’ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో రాయిపల్లీ (డి) గ్రామానికి చెందిన ఆత్మ కమిటీ డైరెక్టర్ సంజీవరెడ్డి కుమారుడు శశిధర్ రెడ్డి – శృతిల వివాహ వేడుక శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా|| సిద్ధం ఉజ్వల్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ శిరీష సురేందర్ రెడ్డి, హుగ్గెల్లీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్ శ్రీధర్ రెడ్డి, సీనియర్ నాయకులు పట్లోళ్ళ శ్రీకాంత్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, మల్లన్న పాటిల్, ముల్తాని, యూత్ కాంగ్రెస్ నాయకులు హర్షవర్ధన్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, నాయకులు ఇమామ్ పటేల్, రాములు, పాండురంగా రెడ్డి, మశ్చందర్ తదితరులు పాల్గొన్నారు.