రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ వై.నరోత్తం

రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ వై.నరోత్తం

G Narsimulu
Highlights
  • రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ వై.నరోత్తం
  • Swathi Digital News Zaheerabad

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం నాయకుల సాదర ఆహ్వానం మేరకు వారి నివాసాలకు వెళ్ళిన మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ వై.నరోత్తం ముస్లిం సోదరులందరికీ హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యంగా మున్సిపల్ కౌన్సిలర్ మహ్మద్ అబ్దుల్లా ఆహ్వానాన్ని మన్నించి ఆయన గృహానికి చేరుకున్న నరోత్తం అక్కడ ఏర్పాటు చేసిన రంజాన్ విందులో పాల్గొని ఆతిథ్యం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పండుగ క్రమశిక్షణకు మరియు సోదరభావానికి ప్రతీక అని పేర్కొంటూ నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బండి మోహన్ తో పాటు ఎస్.గోపాల్, అబ్దుల్ మాలిక్, జి.మల్లేశం, చెంగల్ జైపాల్, ఎస్.శ్రీనివాస్, బి.దిలీప్, సలీమ్ మరియు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share This Article
24 Comments