జహీరాబాద్ (స్వాతి డిజిటల్ న్యూస్):
ఝరాసంగం మండలం పొట్టిపల్లి గ్రామ శివారులో వెలసిన పురాతన సిద్ధేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని శాసనసభ్యులు మాణిక్ రావు, డిసిఎంఎస్ అధ్యక్షులు శివకుమార్ తెలిపారు. ఈ ఆలయం ఎంతో ప్రాచీనమైనదని, దీని అభివృద్ధికి అవసరమైన చర్యల కోసం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు.
గురువారం సిద్ధేశ్వర స్వామి దేవాలయ జాతర ఉత్సవాల సందర్భంగా వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతరలో భాగంగా నేడు అగ్నిగుండ ప్రవేశం, పల్లకి సేవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, విజయ్ పటేల్, రాథోడ్ భీమ్ రావు నాయక్, గ్రామ పెద్దలు సిద్ధన్న పటేల్, సర్పంచ్ మొగుళ్ళన్న, మణికప్ప, భీమ్ రావు, బస్వరాజ్ షేరి, ఉప సర్పంచ్ జగన్నాథం, వార్డు సభ్యులు నర్సింలు, సంగన్న, మొగులప్ప తదితరులు పాల్గొన్నారు.