జహీరాబాద్‌లో వైభవంగా హనుమాన్ శోభాయాత్ర

జహీరాబాద్‌లో వైభవంగా హనుమాన్ శోభాయాత్రలో ప్రజాప్రతినిధుల పూజలు

G Narsimulu
Highlights
  • పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు మరియు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్.
  • జహీరాబాద్‌లో అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగిన హనుమాన్ శోభాయాత్రలు

జహీరాబాద్ (స్వాతి డిజిటల్ న్యూస్):

హనుమాన్ జయంతి పురస్కరించుకుని పట్టణంలో నిర్వహించిన హనుమాన్ శోభాయాత్రలు అత్యంత వైభవంగా సాగాయి. ఈ వేడుకల్లో శాసనసభ్యులు మాణిక్ రావు, డిసిఎంఎస్ అధ్యక్షులు శివకుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హనుమంతుడు భక్తికి, శక్తికి, ధైర్యానికి నిలువెత్తు రూపమని కొనియాడారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే గొప్ప గుణానికి ఆంజనేయుడే నిదర్శనమని, అసాధ్యమైన కార్యాలను సుసాధ్యం చేసే కార్యసాధకుడని పేర్కొన్నారు. వాయుపుత్రుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు.

ఈ వేడుకల్లో మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, వెంకటేశం, ముఖ్య నాయకులు నామ రవికిరణ్, అశోక్ శేరి, మహిపాల్, విశ్వేశ్వర్, చిన్న రెడ్డి, జగదీష్, రాథోడ్ భీమ్ రావు నాయక్, వెంకట్ సాగర్, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.

Share This Article
2 Comments