మహీంద్రా ట్రాక్టర్స్ ఎన్నికల ప్రచారంలో ఉవ్వెత్తున ఎగసిన కార్మిక గళం

మహీంద్రా ట్రాక్టర్స్ ఎన్నికల ప్రచారంలో ఉవ్వెత్తున ఎగసిన కార్మిక గళం

G Narsimulu
Highlights
  • Swathi Narsimulu

జహీరాబాద్, మార్చి 18: జహీరాబాద్‌లోని మహీంద్రా ట్రాక్టర్స్ పరిశ్రమలో జరుగుతున్న కార్మిక సంఘం ఎన్నికల ప్రచారం భాగంగా నిర్వహించిన గేట్ మీటింగ్‌కు కార్మికులు అశేషంగా తరలివచ్చారు. ఈ సభలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు పాల్గొని కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల హక్కుల రక్షణ కోసం నిరంతరం పోరాడేది సిఐటియు మాత్రమేనని స్పష్టం చేశారు. యాజమాన్యాల అణచివేత ధోరణులను ఎండగడుతూ, కార్మికుల సంక్షేమం మరియు వేతన ఒప్పందాల సాధన కోసం సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో సిఐటియు విజయమే లక్ష్యంగా ప్రతి కార్మికుడు నడుం బిగించాలని కోరారు.

సమస్యల పరిష్కారానికి, పని ప్రదేశాల్లో మెరుగైన వసతుల కల్పనకు తమ సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు, ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో మహీంద్రా పరిశ్రమ కార్మికులు, కార్యకర్తలు పాల్గొని సంఘీభావాన్ని ప్రకటించారు.

Share This Article
17 Comments