జహీరాబాద్‌లో గ్యాస్ కొరత లేదు: పుకార్లను నమ్మవద్దు

జహీరాబాద్‌లో గ్యాస్ కొరత లేదు: పుకార్లను నమ్మవద్దు

G Narsimulu
Highlights
  • Zaheerabad NEWS

మార్చ్ 14సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం
జహీరాబాద్: పట్టణంలో వంట గ్యాస్ కొరత ఉందంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భారతీయ జనతా పార్టీ పట్టణ విభాగం స్పష్టం చేసింది. పట్టణ అధ్యక్షుడు పూల సంతోష్ నాయకత్వంలో ప్రతినిధి బృందం స్థానిక గ్యాస్ నిల్వ కేంద్రానికి (గోదాం) వెళ్లి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించింది. అక్కడి నిల్వలు మరియు సరఫరా తీరును అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుతం పట్టణానికి సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు కృత్రిమ కొరతను సృష్టించే అబద్ధపు ప్రచారాలను, పుకార్లను నమ్మవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకుడు సుధీర్ భండారి, కౌన్సిలర్లు బొగ్గుల సంతోష్, అప్పం శ్రవణ్, నాయకుడు రాయిపల్లి సునీల్ మరియు ఇతరులు పాల్గొన్నారు.

Share This Article
77 Comments