నివాస ప్రాంతంలో విద్యుత్ ఉప కేంద్రం వద్దు: ఏపీహెచ్‌బీ కాలనీ వాసుల ఆందోళన

జహీరాబాద్: పట్టణంలోని 23వ వార్డు

G Narsimulu
Highlights
  • Zaheerabad

మార్చ్ 14(సంగారెడ్డి జిల్లా జహీరాబాద్)

జహీరాబాద్: పట్టణంలోని 23వ వార్డు ఏపీహెచ్‌బీ కాలనీలో విద్యుత్ ఉప కేంద్రం (సబ్ స్టేషన్) నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ కాలనీ వాసులు గళమెత్తారు. కాలనీలోని ఉద్యానవన స్థలంలో విద్యుత్ శాఖ అధికారులు సర్వే నిర్వహించి, పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతుండటంతో స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.ప్రస్తుతం ఈ స్థలంలో పచ్చని చెట్లు, మొక్కలు ఏపుగా పెరిగి ఉన్నాయని, నివాసాల మధ్య ఉప కేంద్రం నిర్మిస్తే శబ్ద కాలుష్యం మరియు రవాణా పరమైన ఇబ్బందులు తలెత్తుతాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యానికి, ప్రశాంతతకు భంగం కలిగించే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాలనీలో సామాజిక భవనం (కమ్యూనిటీ హాల్) నిర్మించుకోవడానికి వేరే ప్రభుత్వ స్థలం అందుబాటులో లేనందున, ఈ ఉద్యానవన స్థలాన్ని సామాజిక అవసరాలకే కేటాయించాలని కోరుతున్నారు.విద్యుత్ ఉప కేంద్రం పనులను వెంటనే నిలిపివేసి, దానిని వేరే ప్రాంతానికి తరలించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సమస్యపై ఇప్పటికే ఎంపీ, ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ మరియు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు ప్రతులు పంపినట్లు కాలనీ ప్రతినిధులు తెలిపారు.

Share This Article
27 Comments