ఇఫ్తార్ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై.నరోత్తం

ఇఫ్తార్ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై.నరోత్తం

G Narsimulu
Highlights
  • Swathi Narsimulu

జహీరాబాద్: జహీరాబాద్ పట్టణం భరత్ నగర్‌లో సిపిఐ జిల్లా కార్యదర్శి సయ్యద్ జలాలోద్దీన్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై.నరోత్తం పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ఆయన ఇఫ్తార్ విందులో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో షేక్ ఫరీద్, మహ్మద్ అలీ, ఎస్.గోపాల్ తో పాటు పాత్రికేయులు మహ్మద్ షకీల్, కరీం, విష్ణు, ఎంజాయ్, రాచన్న పాల్గొన్నారు. అలాగే నాయకులు ఇంద్రారెడ్డి, పాండు మరియు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు హాజరయ్యారు.

రంజాన్ మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ విందులో పాల్గొనడం సంతోషంగా ఉందని, ఇలాంటి కార్యక్రమాలు మత సామరస్యానికి ప్రతీకలని నాయకులు పేర్కొన్నారు.

Share This Article
20 Comments