తెలంగాణ గడ్డపై అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్కా లాంబాకు ఘనస్వాగతం

తెలంగాణ గడ్డపై అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్కా లాంబాకు ఘనస్వాగతం

G Narsimulu
Highlights
  • Swathi Narsimulu
  • జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈరోజు హైదరాబాద్ చేరుకున్న అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్కా లాంబాకు జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా సాదర స్వాగతం పలికారు.రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడం, మహిళా విభాగం పటిష్టత మరియు రాబోయే రాజకీయ కార్యాచరణపై చర్చించేందుకు విచ్చేసిన ఆల్కా లాంబాకు అస్మా పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా అస్మా మాట్లాడుతూ.. జహీరాబాద్ నియోజకవర్గంలోని స్థానిక సమస్యలను, మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను జాతీయ అధ్యక్షురాలి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని పేర్కొన్నారు. కార్యకర్తలలో నూతన ఉత్సాహాన్ని నింపడానికి, పార్టీ ఉనికిని ప్రతి గ్రామానికి చేరవేయడానికి ఆల్కా లాంబా పర్యటన ఎంతో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తూ, ప్రజా సమస్యలపై పోరాటమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు స్పష్టం చేశారు.

Share This Article
9 Comments