రైలు ప్రయాణికులకు గమనిక: టికెట్ రద్దు నిబంధనల్లో కీలక మార్పులు!

రైల్వే ప్రయాణికులకు అలర్ట్: టికెట్ రద్దు నిబంధనల్లో భారీ మార్పులు!

G Narsimulu
Highlights
  • జహీరాబాద్ (స్వాతి డిజిటల్ న్యూస్):

జహీరాబాద్ (స్వాతి డిజిటల్ న్యూస్): రైలు ప్రయాణీకుల సౌకర్యార్థం రైల్వే శాఖ టికెట్ రద్దు (క్యాన్సిలేషన్) ఛార్జీల విషయంలో నూతన నిబంధనలను తీసుకువచ్చింది. ఈ కొత్త మార్పులు ఏప్రిల్ 1 నుండి 15వ తేదీ మధ్య అమలులోకి రానున్నాయి. ప్రయాణానికి ముందు టికెట్ రద్దు చేసుకునే సమయాన్ని బట్టి తిరిగి ఇచ్చే నగదు (రీఫండ్) మొత్తంలో మార్పులు చేశారు.

నూతన నిబంధనల వివరాలు:

  • 72 గంటల ముందు: ప్రయాణ సమయానికి 72 గంటల కంటే ముందే టికెట్ రద్దు చేసుకున్నట్లయితే, నామమాత్రపు రుసుము మినహాయించి పూర్తి నగదును ప్రయాణికులకు తిరిగి చెల్లిస్తారు.
  • 72 నుండి 24 గంటల లోపు: ఒకవేళ ప్రయాణానికి 72 గంటల నుండి 24 గంటల మధ్య టికెట్ రద్దు చేస్తే, మొత్తం టికెట్ ధరలో 25 శాతం నగదును మినహాయించుకుంటారు.
  • 24 నుండి 8 గంటల లోపు: ప్రయాణానికి ఒక రోజు (24 గంటలు) నుండి 8 గంటల ముందు వరకు టికెట్ రద్దు చేసుకుంటే 50 శాతం నగదు కోత విధిస్తారు.
  • 8 గంటల లోపు: ప్రయాణ సమయానికి కేవలం 8 గంటల సమయం మాత్రమే ఉన్నప్పుడు టికెట్ రద్దు చేసుకుంటే, ఎలాంటి నగదు తిరిగి చెల్లించబడదు.

ఈ నిబంధనలు ఏప్రిల్ మొదటి వారం నుండి అమలులోకి రానున్న నేపథ్యంలో, ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను తదనుగుణంగా సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Share This Article
1 Comment