చిరాక్ పల్లిలో ఘనంగా వీర హనుమాన్ శోభాయాత్ర

చిరాక్ పల్లిలో కన్నులపండువగా సాగిన వీర హనుమాన్ శోభాయాత్ర

G Narsimulu
Highlights
  • పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న పట్టణ అధ్యక్షులు పూల సంతోష్, కౌన్సిలర్ బొగ్గుల సంతోష్.

జహీరాబాద్ (స్వాతి డిజిటల్ న్యూస్):

హనుమాన్ జయంతి పురస్కరించుకుని చిరాక్ పల్లి గ్రామంలో వీర హనుమాన్ శోభాయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఉత్సవాల్లో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు పూల సంతోష్, జహీరాబాద్ పురపాలక సంఘం కౌన్సిలర్ బొగ్గుల సంతోష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

గ్రామ వీధుల్లో కొనసాగిన శోభాయాత్రలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఆంజనేయుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హనుమంతుని ఆశీస్సులతో గ్రామం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share This Article
12 Comments