రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మెరుగుదలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆర్థికవేత్త అర్వింద్ సుబ్రమణియన్ భేటీ

రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మెరుగుదలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆర్థికవేత్త అర్వింద్ సుబ్రమణియన్ భేటీ

G Narsimulu
Highlights
  • Swathi Narsimulu

హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భారత ప్రభుత్వ మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు, ప్రముఖ ఆర్థికవేత్త అర్వింద్ సుబ్రమణియన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్‌లో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక వృద్ధికి అవసరమైన పలు కీలక వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు.

ప్రధానంగా విద్యుత్ రంగం, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్లు, జీఎస్టీ విభాగాల్లో ఆదాయ వనరులను పెంచుకోవడానికి అనుసరించాల్సిన నమూనా మూల్యాంకనం, పన్నుల అంచనా వంటి అంశాలపై సుబ్రమణియన్ పలు కీలక సూచనలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టి, ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడంపై ఈ సందర్భంగా చర్చ సాగింది.

ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు నిపుణుల సలహాలను పరిగణనలోకి తీసుకుని ముందడుగు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Share This Article
63 Comments