శ్రీ సిద్ధేశ్వరాలయమున ఘనంగా ఉగాది మరియు అమావాస్య పూజా కార్యక్రమములు

Sri Siddheshwara Swamy Temple

G Narsimulu
Highlights
  • Swathi Narsimulu

జహీరాబాద్:

స్థానిక అల్గోల్ రహదారిపై వెలసియున్న శ్రీ మంగళ గౌరీ సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవస్థానమున, ఈ నెల 19వ తేదీ గురువారం నాడు అమావాస్య మరియు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని విశేష ఆధ్యాత్మిక కార్యక్రమములు నిర్వహించ తలపెట్టినట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు.

కార్యక్రమ వివరములు: రేపు ఉదయం 7:30 గంటలకు లోకకల్యాణార్థం స్వామివారికి మహన్యాస పూర్వక రుద్రాభిషేకము, జగన్మాత మంగళ గౌరీ అమ్మవారికి కుంకుమార్చన, మరియు శనీశ్వర స్వామివారికి భక్తిశ్రద్ధలతో తైలాభిషేకము శాస్త్రోక్తంగా జరుపబడును. అనంతరం ఉదయం 10:00 గంటల నుండి విచ్చేసిన భక్తకోటికై మహా అన్నప్రసాద వితరణ గావించబడును.

సాయంత్రం పంచాంగ శ్రవణము: శ్రీ పరాభవ నామ నూతన సంవత్సర ఫలితములను భక్తులకు వివరించుటకు, సాయంత్రం 05:00 గంటలకు ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ సంగమేశ్వర శర్మ గారిచే సామూహిక పంచాంగ శ్రవణము నిర్వహించబడును.

దాతల వివరములు: ఈ పుణ్యకార్యమునకు అన్నదాతలుగా శ్రీయుతులు కొండగోని మల్లేశం-స్వప్న దంపతులు, మహేష్-పావని, శశికళ, లక్ష్మీ ప్రసన్న గారు మరియు ఆరోళ్ల అంజన్న-రుక్మిణి దంపతులు, ప్రణీత్, అఖిల, వైష్ణవి గారు భక్తితో సహకరిస్తున్నారు.

విన్నపము: దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు దేవస్థాన కమిటీ వారు జహీరాబాద్ పట్టణ మరియు పరిసర ప్రాంత భక్తులందరినీ ఈ మహత్కార్యమున పాల్గొని, స్వామివారి కృపాకటాక్షములను పొందవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నారు.


ఇట్లు, నిర్వాహకులు, శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవస్థానం, అల్గోల్ రోడ్, జహీరాబాద్.

Share This Article
12 Comments