జహీరాబాద్ సిద్ధేశ్వర ఆలయంలో భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం

జహీరాబాద్ సిద్ధేశ్వర ఆలయంలో భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం

G Narsimulu
Highlights
  • Swathi Digital News

జహీరాబాద్ స్థానిక సిద్ధేశ్వర మందిరంలో హనుమాన్ చాలీసా పారాయణ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది. లోకకళ్యాణార్థం చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా గణపతి మంత్ర పఠనంతో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం భక్తులు అత్యంత నిష్ఠతో గాయత్రి మంత్రం మరియు మహామృత్యుంజయ మంత్రాన్ని పారాయణం చేశారు.

ఈ సందర్భంగా స్వామివారికి శివాష్టోత్తర శతనామావళి మరియు లింగాష్టకం పఠిస్తూ ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అనంతరం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం భక్తి పారవశ్యం మధ్య కొనసాగింది. కార్యక్రమం ముగింపులో స్వామివారికి మంగళ హారతి సమర్పించి, విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేయడం జరిగింది. “ఓం నమశ్శివాయ” నామస్మరణతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share This Article
132 Comments