పేదల సొంతింటి కల నిజం కావడమే ప్రభుత్వ లక్ష్యం: అస్మా

పేదల సొంతింటి కల నిజం కావడమే ప్రభుత్వ లక్ష్యం: అస్మా

G Narsimulu
Highlights
  • పేదల సొంతింటి కల నిజం కావడమే ప్రభుత్వ లక్ష్యం: అస్మా

మొగుడంపల్లి (జహీరాబాద్): పేదల సొంతింటి కలను నిజం చేయడమే ముఖ్యమంత్రి లక్ష్యమని జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా పేర్కొన్నారు. గురువారం మొగుడంపల్లి మండలం మీర్జంపల్లి తండాలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ళ గృహ ప్రవేశ కార్యక్రమంలో ఆమె పాల్గొని రిబ్బన్ కట్ చేశారు. లబ్ధిదారురాలు కిరణ్ బాయి కృష్ణ నూతన గృహంలోకి ఆమెతో కలిసి ప్రవేశించారు.

ఈ సందర్భంగా అస్మా మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం ఇళ్ళ నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని అమలు చేస్తోందని వివరించారు. సొంతింటి కల నెరవేరినందుకు లబ్ధిదారులు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు సుభాష్ (మీర్జంపల్లి), రాజు (మొగుడంపల్లి), నారాయణ (గౌసాబాద్ తండా), ఉప సర్పంచ్ సుభాష్, మహిళా నాయకురాలు మారుణి బాయి, సీతా బాయి, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share This Article
18 Comments