బోరంచ: వసంత పంచమి పూజలందుకున్న నల్ల పోచమ్మ

G Narsimulu
వసంత పంచమి సందర్భంగా మనూర్ మండలం బోరంచ నల్ల పోచమ్మకు శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. తీరొక్కపూలు, పట్టు వస్త్రాలతో పసుపు, గంధం పూసి సుందరంగా అలంకరించారు. వసంత పంచమి కావడంతో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో వచ్చారు. భక్తులు అమ్మవారికి పిండి, ఒడి బియ్యం నైవేద్యంగా సమర్పించారు. అమ్మవారికి మంజీరా జలాలతో పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు.

Share This Article
68 Comments