జహీరాబాద్‌లో తుల్జా భవానీ ఆటో ఫైనాన్స్ ప్రారంభం

జహీరాబాద్‌లో తుల్జా భవానీ ఆటో ఫైనాన్స్ ప్రారంభం జహీరాబాద్:

G Narsimulu
Highlights
  • Swathi Digital Media

జహీరాబాద్:పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన తుల్జా భవానీ ఆటో ఫైనాన్స్‌ను ఎమ్మెల్యే మాణిక్ రావు, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ ప్రారంభించారు. కొత్తూర్ గ్రామ సర్పంచ్ మహాదేవి మల్లికార్జున్ కుమారుడు అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయ ప్రారంభోత్సవానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు వారు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నరోత్తం, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుండప్ప, మాజీ DRUCC మెంబర్ షేక్ ఫరీద్ పాల్గొన్నారు. అలాగే బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు తట్టు నారాయణ (జహీరాబాద్), వెంకటేశం (ఝరాసంగం), నర్సింలు (కోహిర్) తో పాటు సర్పంచ్‌లు మచ్చేందర్, నరసింహ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, మోహన్ రాథోడ్ మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share This Article
7 Comments