బోరంచ నల్ల పోచమ్మ ఆలయానికి సిమెంట్ బెంచీలు విరాళం

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం

G Narsimulu
Highlights
  • బోరంచ నల్ల పోచమ్మ ఆలయానికి సిమెంట్ బెంచీలు విరాళం

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ శ్రీ శ్రీ బోరంచ నల్ల పోచమ్మ అమ్మవారి 7 వారాల మహా జాతర త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో, భక్తుల సౌకర్యార్థం వీరభద్ర బోర్ వెల్స్ (NKD) యజమాని వీరన్న (జుక్కల్ గ్రామం) గారు ఉదారత చాటుకున్నారు. భక్తులకు కూర్చోవడానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసేందుకు ఆయన 3 సిమెంట్ బెంచీలను (బల్లలను) విరాళంగా అందజేశారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సిద్ధయ్య స్వామి గారు ఈ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించి, దాత వీరన్న గారిని ఆశీర్వదించారు. జాతర సమయంలో వేల సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఈ బల్లలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులతో పాటు సిబ్బంది శేఖర్, ఇతర ఆలయ సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు.

Share This Article
76 Comments