జహీరాబాద్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో జి. శ్రీనివాస్ రెడ్డి విజయం

జహీరాబాద్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో జి. శ్రీనివాస్ రెడ్డి విజయం

G Narsimulu
Highlights
  • Swathi Narsimulu

జహీరాబాద్ కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి జరిగిన పోటీలో జి. శ్రీనివాస్ రెడ్డి ఘన విజయం సాధించారు. మొత్తం 78 మంది ఓటర్లలో 75 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అధ్యక్ష పదవికి జరిగిన ఈ హోరాహోరీ పోరులో జి. శ్రీనివాస్ రెడ్డికి 46 ఓట్లు రాగా, తన ప్రత్యర్థి పాండురంగ రెడ్డిపై 19 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇతర పదవుల్లో ఉపాధ్యక్షుడిగా గోపాల్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శిగా గోపాల కృష్ణ, సంయుక్త కార్యదర్శిగా సోమశేఖర్ ఎన్నికయ్యారు.

ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే గెలుపొందిన అభ్యర్థులకు తోటి న్యాయవాదులు పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయోత్సవంలో పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు జి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, బార్ అసోసియేషన్ ప్రతిష్టను పెంచేలా, సభ్యులందరి ఐక్యత కోసం అంకితభావంతో పనిచేస్తానని స్పష్టం చేశారు. బార్ అసోసియేషన్ అభివృద్ధికి, సభ్యుల సంక్షేమానికి కట్టుబడి ఉంటామని ఎన్నికైన ప్రతినిధులు ప్రకటించారు. ఈ విజయం పట్ల జహీరాబాద్ లోని న్యాయవాదులు, కోర్టు సిబ్బంది మరియు స్థానిక నేతలు సంతోషం వ్యక్తం చేస్తూ నూతన కార్యవర్గానికి అభినందనలు తెలియజేశారు.

Share This Article
8 Comments