జహీరాబాద్‌లో భారీగా మాదకద్రవ్యాల స్వాధీనం: రాజస్థాన్ వాసి అరెస్ట్

జహీరాబాద్‌లో భారీగా మాదకద్రవ్యాల స్వాధీనం: రాజస్థాన్ వాసి అరెస్ట్

G Narsimulu
Highlights
  • స్వాతి డిజిటల్ న్యూస్: జహీరాబాద్ తాజా వార్తలు


ఏప్రిల్ 18(సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం నిషేధిత మాదకద్రవ్యాలను అక్రమంగా తరలిస్తున్న ముఠా గుట్టును జహీరాబాద్ అబ్కారీ (ఎక్సైజ్) అధికారులు రట్టు చేశారు. గోవా నుండి హైదరాబాద్‌కు ప్రైవేటు బస్సులో తరలిస్తున్న భారీ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు.
అబ్కారీ శాఖ సంచాలకులు శ్రీ షానవాజ్ ఖాసిం ఉత్తర్వుల మేరకు, ఉప సంచాలకులు శ్రీ జె. హరికిషన్ మార్గదర్శకత్వంలో జహీరాబాద్ అబ్కారీ శాఖాధికారి శ్రీ టి. శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం గోవా నుండి వస్తున్న ఒక ప్రైవేటు ప్రయాణికుల బస్సులో మాదకద్రవ్యాలు ఉన్నట్లు అందిన ముందస్తు సమాచారంతో చిరాగ్‌పల్లి తనిఖీ కేంద్రం వద్ద అధికారులు నిఘా పెట్టారు.
తనిఖీల్లో భాగంగా రాజస్థాన్ రాష్ట్రం జోధ్‌పూర్ జిల్లాకు చెందిన బుద్ధ రామ్ అనే వ్యక్తి వద్ద నుంచి సుమారు 1.052 కిలోల చరాస్ అనే మాదకద్రవ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు 8 లక్షల రూపాయల వరకు ఉంటుందని అధికారులు వెల్లడించారు. నిందితుడి వద్ద నుంచి ఒక మొబైల్ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఈ విజయవంతమైన దాడుల్లో అబ్కారీ శాఖాధికారి (ఇన్‌స్పెక్టర్) టి. శ్రీనివాస్ రెడ్డితో పాటు, ఉప అధికారులు (సబ్ ఇన్‌స్పెక్టర్లు) బి. కోటేశ్వర రావు, బి. రమేష్, పి. శాంత, ప్రధాన కానిస్టేబుల్ యదయ్య, కానిస్టేబుల్ యూనస్ పాల్గొన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

Share This Article
Leave a Comment