*HPV వాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మాణిక్ రావు *

G Narsimulu

జహీరాబాద్ స్థానిక ఏరియా ఆసుపత్రిలో పద్నాలుగేళ్ల వయసున్న బాలికలకు గర్భాశయ క్యాన్సర్ నివారణ కోసం ఉద్దేశించిన హెచ్‌పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ప్రారంభించి, ఈ టీకా బాలికల భవిష్యత్తు ఆరోగ్యానికి రక్షణ కవచంలా నిలుస్తుందని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు, అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆసుపత్రిలోని మహిళా వైద్యులను, నర్సులను, ఇతర సిబ్బందిని శాలువాలతో సత్కరించి వారు అందిస్తున్న నిరంతర సేవలను కొనియాడారు, ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నామ రవికిరణ్, హోతి బి గ్రామ సర్పంచ్ మచ్చేందర్, మున్సిపల్ కౌన్సిలర్లు గౌస్ గోరి, జహీద్ అలీ, మహిపాల్ యాదవ్, జాకీర్, పట్టణ యూత్ అధ్యక్షులు కళ్లెం రవి, పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు శివప్ప, నాయకులు విశ్వేశ్వర్, శివకుమార్ స్వామి, దశరథ్, హశం, అలీం తదితరులు పాల్గొన్నారు, అదేవిధంగా పట్టణంలోని బసవ ఫంక్షన్ హాల్ లో జరిగిన రాజా రమేష్ కుమారుడి మరియు కూతురి నూతన వస్త్రాధరణ వేడుకలో శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్, మాజీ మార్కెట్ చైర్మన్ గుండప్ప, ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, సీనియర్ నాయకులు నామ రవికిరణ్, కళ్లెం రవి, అమిత్ కుమార్, వెంకట్ సాగర్ తదితరులు పాల్గొని చిన్నారులను దీవించారు.

Share This Article
31 Comments