ఎండల తీవ్రత పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే మాణిక్ రావు విజ్ఞప్తి

ఎండల తీవ్రత పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే మాణిక్ రావు విజ్ఞప్తి

G Narsimulu

జహీరాబాద్ (స్వాతి డిజిటల్ న్యూస్): నియోజకవర్గంలో ఎండల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్ రావు కోరారు. రానున్న మరికొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని, అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. ముఖ్యంగా వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ వహించకూడదని పేర్కొన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ స్వీయ జాగ్రత్తలు పాటించి సురక్షితంగా ఉండాలని ఎమ్మెల్యే మాణిక్ రావు విజ్ఞప్తి చేశారు.

Share This Article
Leave a Comment