జహీరాబాద్ మాణిక్ ప్రభు మందిరంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు

జహీరాబాద్ మాణిక్ ప్రభు మందిరంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు

G Narsimulu
Highlights
  • Swathi Narsimulu

మార్చ్ 20(సంగారెడ్డి జిల్లా జహీరాబాద్)
జహీరాబాద్: పట్టణంలోని శ్రీ మాణిక్ ప్రభు మందిరంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పంచాంగ శ్రవణం మరియు ఉగాది ప్రాముఖ్యతపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ సత్సంగ్ ప్రముఖ్ రామ్ రెడ్డి ఉగాది విశిష్టతను వివరించగా, పట్టణ ప్రముఖులు బాలచందర్, పాండయ్య, శివశక్తి జిల్లా సమన్వయకర్త శ్యామ్ రావు మరియు తెలుగు పండితులు ఉమామహేశ్వర్ నూతన సంవత్సర ఫలితాలను, పంచాంగ విశేషాలను భక్తులకు చక్కగా వివరించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ పురపాలక అధ్యక్షులు ఎండి యూనుస్, ఉపాధ్యక్షులు శిరీష సురేందర్ రెడ్డి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు పూల సంతోష్, జహీరాబాద్ మున్సిపాలిటీ కౌన్సిలర్ బొగ్గుల సంతోష్, వివిధ వార్డుల పెద్దలు మరియు చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. భక్తిశ్రద్ధల మధ్య జరిగిన ఈ వేడుక “జైశ్రీరామ్” నినాదాలతో మారుమోగింది.

Share This Article
3 Comments