రంజోల్‌లో రేపు దత్తాత్రేయ స్వామివారికి పంచామృత అభిషేకం, అన్నప్రసాద వితరణ

రంజోల్‌లో రేపు దత్తాత్రేయ స్వామివారికి పంచామృత అభిషేకం, అన్నప్రసాద వితరణ

G Narsimulu
Highlights
  • రిపోర్టింగ్: స్వాతి నరసింహులు, స్వాతి డిజిటల్ న్యూస్.

జహీరాబాద్ (స్వాతి డిజిటల్ న్యూస్): సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల పరిధిలోని రంజోల్ గ్రామంలో వెలసిన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయంలో రేపు (బుధవారం) పౌర్ణమి పుణ్యఘడియల సందర్భంగా ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

హౌసింగ్ బోర్డు నివాసి, స్వర్గీయ శ్రీ హరే రామ్ (ఆంధ్రా) గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు స్వామివారికి శాస్త్రోక్తంగా ‘పంచామృత అభిషేకం’ నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 8 గంటలకు భక్తులకు అల్పాహార ప్రసాద వితరణ ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల నుండి ఆలయ ప్రాంగణంలో భక్తులందరికీ భారీ అన్నప్రసాద వితరణ (అన్నదానం) కార్యక్రమం జరుగుతుంది.

ఈ సందర్భంగా శ్రీ దత్తాత్రేయ ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. భక్త మహాశయులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించి, అన్నప్రసాద కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

ఇట్లు: శ్రీ దత్తాత్రేయ ఆలయ కమిటీ, రంజోల్.

Share This Article
Leave a Comment