మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ వై. నరోత్తం

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ వై. నరోత్తం

G Narsimulu
Highlights
  • Swathi Narsimulu

మొగుడంపల్లి, మార్చి 18: మొగుడంపల్లి మండలం గొడిగార్ పల్లి గ్రామంలో విషాదం నెలకొంది. గత ఐదు రోజుల క్రితం మరణించిన ఈడిగి ఇస్మాయిల్ జి గౌడ్ (ఈడిగి విఠల్ గౌడ్ తండ్రి) కుటుంబాన్ని బుధవారం మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ వై. నరోత్తం పరామర్శించారు.

వారి నివాసానికి వెళ్లిన నరోత్తం, ఇస్మాయిల్ గౌడ్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు:

  • మాజీ సర్పంచ్ అశోక్ గౌడ్
  • ఎన్. మల్లేశం
  • చెంగల్ జైపాల్
  • సామెల్
  • మరియు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Share This Article
24 Comments