మనూర్ (స్వాతి డిజిటల్ న్యూస్): మనూర్ మండలం బోరంచ మంజీర నదీ తీరాన వెలిసిన శ్రీ నల్ల పోచమ్మ ఆలయంలో అమావాస్యను పురస్కరించుకుని ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంజీర నది పవిత్ర జలాలతో అమ్మవారికి జలాభిషేకం నిర్వహించిన అనంతరం, వేద మంత్రోచ్ఛారణల మధ్య పంచామృతాలతో అభిషేకాలు జరిపారు. అమ్మవారిని విశేష పుష్ప అలంకరణలతో శోభాయమానంగా తీర్చిదిద్ది, ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అమావాస్య సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు మంజీర నదిలో స్నానాలు ఆచరించి, ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు.
అమావాస్య పురస్కరించుకుని శ్రీ నల్ల పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు
అమావాస్య పురస్కరించుకుని శ్రీ నల్ల పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు