మే 13 నుంచి ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు

మే 13 నుంచి ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు

G Narsimulu

జహీరాబాద్ (స్వాతి డిజిటల్ న్యూస్): తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. మే 13వ తేదీ నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఉత్తీర్ణులు కాని వారు, అలాగే మార్కుల మెరుగుదల (ఇంప్రూవ్‌మెంట్) కోసం ప్రయత్నించే విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కావచ్చు.

పరీక్షలు మే 22వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండో సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రాక్టికల్ పరీక్షలు జూన్ మొదటి వారంలో జరిగే అవకాశం ఉంది. విద్యార్థులు సంబంధిత కళాశాలల్లో గడువులోగా పరీక్ష ఫీజు చెల్లించాలని అధికారులు సూచించారు.

Share This Article
Leave a Comment