మాణిక్ ప్రభు వీధిలో భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం

మాణిక్ ప్రభు వీధిలో భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం

G Narsimulu

జహీరాబాద్ (స్వాతి డిజిటల్ న్యూస్):

హనుమాన్ జయంతి పురస్కరించుకుని పట్టణంలోని మాణిక్ ప్రభు వీధి హనుమాన్ మందిరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఓంకారము, గౌరీ గణపతి మంత్ర పఠనంతో పాటు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు.

ఈ వేడుకల్లో జహీరాబాద్ పురపాలక సంఘం అధ్యక్షురాలు శిరీష సురేందర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివశక్తి ఉమ్మడి మెదక్ జిల్లా సమన్వయకర్త శ్యామ్ రావు, జిల్లా కార్యదర్శి సంగమేశ్వర్, జహీరాబాద్ సలహాదారు నరసింహులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అదేవిధంగా ఉపాధ్యక్షులు వెంకటేశం, కార్యదర్శులు శ్రీనివాస్ రెడ్డి, రాజ్ కుమార్, ప్రభాకర్ రెడ్డి, మిట్టు, గోరక్నాథ్ రావు, బసవరాజ్, డాక్టర్ బసవరాజ్ తదితరులు పాల్గొన్నారు. భక్తులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొని ఆంజనేయుని కృపకు పాత్రులయ్యారు. ఆలయ ప్రాంగణం మొత్తం భక్తి నినాదాలతో మారుమోగింది.

Share This Article
Leave a Comment