యువత రక్తదానం ప్రాణదానంతో సమానం: ఎమ్మెల్యే కోనింటి మాణిక్ రావు

యువత రక్తదానం ప్రాణదానంతో సమానం: ఎమ్మెల్యే కోనింటి మాణిక్ రావు

G Narsimulu


జగజ్యోతి బసవేశ్వరుల జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని బసవ కళ్యాణ మండపం వేదికగా లింగాయత్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం అత్యంత ఉత్సాహంగా జరిగింది. ఈ సేవా కార్యక్రమానికి జహీరాబాద్ శాసనసభ్యులు శ్రీ కోనింటి మాణిక్ రావు, ఉమ్మడి జిల్లా విక్రయాల సహకార సంఘం అధ్యక్షులు శ్రీ శివకుమార్, మరియు మండల పరిషత్ అధ్యక్షులు శ్రీ తట్టు నారాయణ ముఖ్య అతిథులుగా విచ్చేసి శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలందరికీ బసవ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. రక్తదానం అనేది అత్యంత పుణ్యకార్యమని, ప్రతి ఏటా లింగాయత్ సమాజం వారు ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం రక్తదానం చేసిన యువతకు అతిథులు స్వయంగా ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం సభ్యులు విశ్వేశ్వర్, నాయకులు ఆర్. సుభాష్, ప్రభు పటేల్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment