హెచ్ఐవి పై అవగాహన సదస్సు

హెచ్ఐవి పై అవగాహన సదస్సు

G Narsimulu
Highlights
  • Swathi Narsimulu

జహీరాబాద్ పట్టణంలోని షట్కార్ ఫంక్షన్ హాల్ లోఆచార్య డిగ్రీ కళాశాల , రెడ్ రిబ్బన్ క్లబ్ మరియు ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం హెచ్ఐవి పై జిల్లాస్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉస్మానియా యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి వెలిగించి , జెండావిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు తదనంతరం మాట్లాడుతూ హెచ్ఐవి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి , వ్యాధి సంక్రమణ జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు అదేవిధంగా వాలంటీర్లను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామాలలో పట్టణాలలో హెచ్ఐవి పై అవగాహన కలిగించాలని యువత సాధించనిది అంటూ ఏమీ లేదని మీ వంతు కృషి చేసి సమ సమాజానికి హెచ్ఐవి పై అవగాహన కలిగించాలని ఎన్ఎస్ఎస్ వాలంటరీస్ కి తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ నరసింహారావు మాట్లాడుతూ విద్యార్థులకు సమాజంపై స్పృహ కలిగి ఉండాలని తెలియజేశారు అదేవిధంగా జహీరాబాద్ ఏరియా ఆసుపత్రి ఎయిడ్స్ డైరెక్టర్ అజయ్ మాట్లాడుతూ రక్త పరీక్షలు మరియు చికిత్స సలహా సూచనల గురించి వారిని సంప్రదించాలని తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించినటువంటి నృత్య ప్రదర్శనలు మరియు స్కిట్లు ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో ఆచార్య కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ చింతల హరికుమార్, వశిష్ట కాలేజ్ ప్రిన్సిపల్ సిద్ధారెడ్డి మరియు ప్రోగ్రాం ఆఫీసర్స్ వెంకట్రాం రెడ్డి ,నందు గౌడ్, శకుంతల, రాములు, ప్రీతి, ముజాఫర్, మారుతి రావు, అమర్నాథ్ ,దీపిక, దత్తు మరియు ఆచార్య డిగ్రీ కళాశాల అధ్యాపకులు , ఎన్ఎస్ఎస్ వాలంటరీలు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment