జహీరాబాద్ అభివృద్ధికి నిధులు విడుదల చేయండి: సీడీఎంఏకు మున్సిపల్ చైర్మన్ విన్నపం

జహీరాబాద్ అభివృద్ధికి నిధులు విడుదల చేయండి: సీడీఎంఏకు మున్సిపల్ చైర్మన్ విన్నపం

G Narsimulu

జహీరాబాద్ (స్వాతి డిజిటల్ న్యూస్): జహీరాబాద్ పట్టణంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించేలా నిధులు విడుదల చేయాలని మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ యూనూస్ సీడీఎంఏ టీకే శ్రీదేవిని కోరారు. గురువారం హైదరాబాద్‌లో ఆమెను కలిసి ఈ మేరకు విన్నపత్రం సమర్పించారు. యూఐడీఎఫ్ పథకం కింద మంజూరైన 18.70 కోట్ల రూపాయల నిధులకు సంబంధించి 16 పనులకు టెండర్లు పూర్తయినా, చెల్లింపులపై స్పష్టత లేక పనులు ఆగిపోయాయని ఈ సందర్భంగా వివరించారు.

నిధుల విడుదలపై స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చి పనులు గ్రౌండింగ్ అయ్యేలా చూడాలని కోరగా, ఆమె సానుకూలంగా స్పందించినట్లు చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శిరీష సురేందర్ రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment